కుల వివక్షతో బౌద్ధవులను అవమానించి దురుసు ప్రవర్తనతో దళిత నేతల్ని గాయపరిచి బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయించి అప్రజాస్వామికంగా వ్యవహరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పై విచారణకు ఆదేశాలు ఇచ్చి, తగు చర్యలు తీసుకోవాలి
తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఫిర్యాదు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తధాగాదుడు గౌతమ బుద్ధుని తల నరికిన ఉన్మాద దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి,
కుల వివక్షతో బౌద్ధవులను అవమానించి- దురుసు ప్రవర్తనతో దళిత నేతలు గాయపరిచి- బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయించి అప్రజాస్వామికంగా వ్యవహరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని నేడు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు ,రాష్ట్ర కార్యదర్శి మల్లారపు వాసు లు జిల్లా డిప్యూటీ కలెక్టర్ రోజా రాణి గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పాలకుంట శ్రీనివాసులు, మల్లెమొగ్గలు ఉమాపతి మాట్లాడుతూ మదనపల్లి లో బుద్ధుని కొండ మీద గల బుద్ధ భగవాన్ తలను నరికిన అసాంఘిక శక్తులను గుర్తించి అరెస్టు చేయాలని మదనపల్లి లో శాంతియుత నిరసన దీక్ష చేపట్టిన భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ గారిని అరెస్టు చేసి, పోలీసు స్టేషన్లో నిర్బంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో భౌతికంగా దాడి చేసి గాయపరిచి అక్రమ కేసులు బనాయించడం చాలా హేయమైన చర్య అని ,అన్నమయ్య జిల్లాలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పౌర హక్కుల్ని గాలికి వదిలేసి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అన్యాయాన్ని ప్రశ్నించిన అనేకమంది ఉద్యమకారుల పట్ల కుల అహంకార భావంతో అక్రమ కేసులు కట్టించిన ఘనత విద్యాసాగర్ నాయుడుకే దక్కుతుందని, ఏ జిల్లాలో లేని అప్రజాస్వామిక విధానాలను అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వీరు మండిపడ్డారు. బుద్ధుని, బౌద్ధ అమరావతి రాజధాని పేరుతో వాడుకుంటూ సౌత్ ఆసియా దేశాల సహాయ సహకారాలు పొందుతున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో బుద్ధుని తల నరికిన ఉన్మాద ఘటనపై ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గౌతమ బుద్ధుని తలనరిగిన ఉన్మాద దుర్ఘటనపై, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అప్రజాస్వామిక , అవినీతి చర్య పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో త్వరలో చలో మదనపల్లి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పాలకుంట చౌడప్ప, జడ ప్రకాష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.