నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: ఎలాంటి ఆసరాలేని తనకంటూ ఎవరూ లేని ఓ అనాధ శవానికి అంతా తానై కుటుంబ సభ్యుడిలా వ్యవహరించి తన సొంత నిధులతో అంత్యక్రియలు జరిపించిన ములకలచెరువు ఎస్ఐ నరసింహుడు చేసిన గొప్ప ఔదార్యానికి ములకలచెరువు స్థానిక గ్రామవాసులు మరియు ములకలచెరువు వాసులు ప్రశంసిస్తున్నారు. స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన గాలేటి వారి పల్లి గ్రామ సమీపంలోని ఓ గూడులో తలదాచుకొని సుమారు 20 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ కాలం వెలదీస్తున్న ఓ వృద్ధుడు మంగళవారం తలదాచుకున్న గూడు లోనే మృతి చెందాడు. గ్రామస్తులు సమాచారమివ్వడంతో ములకలచెరువు ఎస్ ఐ నరసింహుడు హుటాహుటిన వృద్ధుడు మరణించిన ఆ గూడు వద్దకు చేరుకున్నాడు. ఆ వృద్ధుడికి ఎలాంటి ఆసరా లేదు. తన వాళ్లంటూ ఎవరూ లేరు. భిక్షాటనతో కడుపు నింపుకుంటూ ఆ షెల్టర్లో తలవాల్చుకునేవాడు. మానవతా వాదంతో చలించిపోయిన ములకలచెరువు ఎస్ ఐ నరసింహుడు ఆయన అంతక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. అంతా తానై కుటుంబ సభ్యుడి లా భావించి తన సొంత నిధులతో ఆ వృద్ధుడికి అంత్యక్రియలు చేశారు. ఆయన చేసిన గొప్ప మనసుకు చుట్టుపక్కల గ్రామవాసులతో పాటు ములకలచెరువు వాసులు హాట్సాఫ్ చెప్తూ ఆయన చేసిన సేవను కొనియాడారు. ఈ అంత్యక్రియ కార్యక్రమానికి డాక్టర్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోనంగి శ్రీనివాసులు, కోనంగి హరీష్, డేరంగుల మస్తాన్, పూజారి హనుమంతు యువకులు కోనంగి ప్రశాంత్, విష్ణు, జహీర్ సహకారమందించారు. ఎస్ ఐ నరసింహుడు స్వతహాగా అనాధ శవాన్ని భుజాలపై మోస్తూ సమాధి వద్ద అంత్యక్రియ కార్యక్రమాన్ని జరిపించారు. ఈయన చేసిన గొప్ప ఔదార్యాన్ని ప్రజలంతా మెచ్చుకున్నారు. ఎలాంటి ఆసరా ఎవరూ లేని వ్యక్తికి సొంత నిధులతో అంత్యక్రియలు జరిపించి తనలోని గొప్ప మాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.~~~~~~~~~~~~~~~~~





