నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకుడు కొప్పాల రమేష్ బాబు బి కొత్తకోట మండల కేంద్రమైన స్థానిక కస్తూరిబాయి పాఠశాలను బుధవారం ఆకస్మాత్తుగా విచ్చేసి సందర్శించి విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి వారి బాగోగులను అడిగి విచారించి తరగతి గదులను ఆరా తీసి పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల అవసరాలను గుర్తించి సొంత ఖర్చులతో పరీక్షలకు ఉపయోగపడే ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్సిల్స్, పెన్లు తదితర స్టేషనరీ సామగ్రిని ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యే భవిష్యత్తుకు పునాది అనే నమ్మకంతో విద్యార్థులకు అవసరమైన మౌలిక సహాయం అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని పిల్లల అభివృద్ధే లక్ష్యంగా, సేవా భావంతో ముందుకు సాగుతున్నామని దూర ప్రాంతాల నుండి తల్లితండ్రులను బంధువులను వదిలి విద్య కోసం ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్న పిల్లలను కలిసి విచారించడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయని మేము కూడా ఇలాగే చదివి ఉన్నతమైన స్థానాలకు ఎదిగిన వాళ్లమేనని ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న ధైర్యం వాళ్లలో కలుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు వాళ్లలో గుర్తింపుగా నిలిచిపోయి ప్రేమగా నిలుస్తుందని రమేష్ బాబు అన్నారు. ఈ సేవా కార్యక్రమానికి రమేష్ బాబు వెంట జనసైనికులు కత్తి ఆది రాయల్, సోమశేఖర, అర్జున్ రాయల్, గల్లా అంజి రాయల్, రెడ్డి మోహన, రమేష్, రాజు, శివ, మహిళ జన సైనికురాలు ప్రభావతి తదితరులుపాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





