Tuesday, March 17, 2026

*తపస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………. వాల్మీకి ఆవాసం నందు జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యనిర్వాక వర్గ సమావేశం లో జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ సంఘ భావజాల విస్తరణకై కృషి చేస్తామని,అదే విధంగా PRC పై పోరాడే సమయం ఆసన్నమైందని దానికి ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి కొక్కుల క్కుల రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగ ఉపాధ్యాయ నిర్లక్ష్యం చేస్తుందని, సమస్యల సాధనకై సంఘం ముందుంటుందని సంఘ అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు A. నరేందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు v.రాజశేఖర్,రాష్ట్ర బాధ్యులు రొట్ట శ్రీనివాస్,గుడిసె పూర్ణ చందర్,ఎలిగేటి రాజేంద్రప్రసాద్, జిల్లా ఎన్నికల పరిశీలకులు గడ్డం మహిపాల్ రెడ్డి,కుమ్మరి కుంట సుధాకర్, కట్ట రాజేశ్వర్ పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా బాధ్యులు మండల బాధ్యులు తపస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News