నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి రూరల్ మంగళంకు చెందిన వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షులు తుంటి సుధా యాదవ్ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటుంటున్నాని తనకు ఎంతో ఆప్తుడిగా, ఆదర్శ నాయకుడిగా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నందున, ఈ పరిస్థితుల్లో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని భావించినట్లు సుధా యాదవ్ తెలిపారు.తమ నాయకుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కష్టాల్లో ఉన్న సమయంలో తన పుట్టినరోజు జరుపుకోవడం సరికాదని భావించి, ఈ ఏడాది అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అయన ప్రకటించారు.కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎదురుకోలేక కుట్రపూరితంగా మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై అక్రమ మద్యం లిక్కర్ కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆయన నమ్ముకున్న ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో కడిగిన ఆణిముత్యంలా బయటకు వచ్చి ప్రజలకు ప్రజా సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు నా నిర్ణయానికి తన అనుచరులు, అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.





