నేటి సాక్షి, హైదరాబాద్ : 510 జీవోలో 4 వేల మందికి అన్యాయం జరిగిందని, అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించాలని జాతీయ ఆరోగ్య మిషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 17514 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సుధా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.