నేటి సాక్షి; తిరుపతి జిల్లా (బాదూరు బాల) గంగాధర నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న తల్లికివందనంకు మంగళం పాడారని, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈనెల 13వ తేదీన శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టున్నట్లు వారు వివరించారు. ఈ మేరకు గురువారం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 – 25 విద్యాసంవత్సరంకు చదువుకునే పిల్లల తల్లులకు ఒక్క రూపాయి కూడా జమ చేయని కూటమి ప్రభుత్వం 2025 – 26 విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరచుకున్నా సరే ఆ పథకం మాట ఎత్తడం లేదని ఆరోపించారు. అదేవిదంగా ఒక ఏడాది కాలంగా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెనలకు నిధులు చెల్లించకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టనున్నామని స్పష్టం చేశారు. 13న చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే నిరసనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. నిరసన వ్యక్తం చేసిన తరువాత కలెక్టర్‌కు వినతి పత్రం అందించడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. కావున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సభ్యులందరూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముని రాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, నియోజకవర్గ ఆర్టిఐ విభాగం అధ్యక్షులు ఢిల్లీ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసుదేవరెడ్డి, పాచిగుంట రాజేంద్ర నాయుడు, విష్ణు,వెంకటేష్, అశోక్, రాజు, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.