నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 16, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో గత కొన్ని రోజులుగా గ్రామంలో బతుకుదెల కోసం వచ్చిన ఒక కుటుంబం పని చేసుకుంటూ ….తమ ఇద్దరు ఆడ పిల్లల్ని గ్రామంలో వదిలిపెట్టి వెళ్లిపోయారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గత ఆరు రోజులుగా గ్రామంలో తిండి తిప్పల కోసం అడక్కు తింటున్న పరిస్థితి నెలకొన్నదని గ్రామస్తులు వివరించారు. తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రాత్రి సమయంలో ఇద్దరు ఆడ పిల్లలు వేసిన టెంటు లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. అధికారులు స్పందించి ఇద్దరు ఆడపిల్లలు ఆదుకోవాలని పెద్ద చింతకుంట గ్రామస్తులు కోరుతున్నారు.

