నేటిసాక్షి గన్నేరువరం:
తల్లి పాలే పిల్లలకు శ్రేయస్కరం అని అంగన్వాడీ సూపర్వైజర్ ఇస్రత్ సుల్తానా అన్నారు.అంతర్జాతీయ తల్లి పాల వారో
త్సవాల్లో భాగంగా మండల పరిధిలోని జంగపల్లి లోని అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు తల్లి పాలపై , కల్పించారు.నవజాత శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల రోగనిరోధక శక్తి అత్యధికంగా లభిస్తుందని పుట్టిన వెంటనే పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు అటికం రజిత, బొజ్జ సరోజన మరియు డాక్టర్ సాహితీ, కార్యదర్శి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.