Monday, March 16, 2026

*తహసిల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్**’భూ-భారతి’ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని ఆదేశం—-*

నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత గురువారం మెట్ పల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న పనుల ప్రగతిని, రికార్డు నిర్వహణను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార పరిస్థితిని ఆమె సమీక్షించారు.*’భూ-భారతి’ సమస్యలపై సమీక్ష*ఇటీవల ప్రారంభించిన ‘భూ-భారతి’ రెవెన్యూ సదస్సులో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భూ వివాదాలపై తక్షణ చర్యలు తీసుకొని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.*మీసేవ సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలి*మీసేవ ద్వారా జారీ చేసే అన్ని రకాల సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉండకూడదని, ప్రజలకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ‘ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు సకాలంలో అందించటం ప్రభుత్వ లక్ష్యం’అని అదనపు కలెక్టర్ లత స్పష్టం చేశారు.ఈ తనిఖీలో మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News