నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: తన నియోజకవర్గంలో పెత్తం దారి వ్యవస్థ ఎక్కువైందంటూ సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో పెత్తందారీ పెత్తనం బాగా పెరిగిపోయిందని తాను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిందులు వేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై మండిపడ్డ ఆయన త్వరలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నియంత్రణ ధోరణి నాకిష్టం లేదని అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి బయటోచ్చానని టీడీపీ లో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని కోనేటి ఆదిమూలం మండిపడ్డారు. ఇప్పుడు నాపై మరొక రెడ్డిని తెచ్చి నామీద పెట్టాలా అంటూ అదిమూలం అసహనం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోనేటి ఆదిమూలం ఆరోపించారు. చిన్నచిన్న విషయాలు సీఎం చంద్రబాబుకు కూడా తెలియడం లేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎం వద్ద వివరంగా చెబుతానన్నారు. ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదని ఈ విషయంలో ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని ఆదిమూలం అన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఎలా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. అసలు, ప్రజా దర్బార్ నేను పెడితే నువ్వేలా పెడుతావని మండిపడ్డారు. తన స్థానంలో పార్టీ కో ఆర్డినేటర్ వ్యవహరిస్తుండటంపై ఆదిమూలం అసహనం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ పెట్టేది నేను. ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సురుటుపల్లి ఆలయంలోనూ నాకు గౌరవం ఇవ్వలేదని సురుటుపల్లి చైర్మన్‌గా ఒక బియ్యం దొంగని నియమించారని ఆరోపించారు. ఈ నియామకంపై కూడా త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చెరువు కొట్టిన ప్రాంతాల్లో ప్రజలకు ఆశించినంత సహాయం అందడం లేదని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని కోనేటి ఆదిమూలం తెలిపారు..~~~~~~~~~~~~~~~~~~





