Thursday, March 19, 2026

తిరుచానూరులో ఉచిత కంటి శుక్ల శస్త్ర చికిత్స శిబిరం.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి రూరల్ప్రపంచ ప్రసిద్ధి చెందిన శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లో కంటి శస్త్ర శిక్ష చేయబడుతుందని చికిత్స పొందిన వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఐవాల్ లెన్స్ నల్ల కళ్ళద్దాలు మరియు మందులతో సహా శస్త్ర చికిత్స చేయబడుతుందన్నారు.శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై మరియు మంజుల మంగపూడి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి శుక్ల సస్త్ర చికిత్స శిబిరం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని శ్రీ ఎన్నారై ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నవంబర్ 20 నుండి 26 తారీకు వరకు ఏడు రోజులు ఉచితంగా కంటి పరీక్షలునిర్వహించబడతాయని, 24 నుండి 28 వరకు కంటి శుక్లాం పొర గల వారికి మాత్రమే ఉచితంగా ఆపరేషన్ చేయబడతా యి అని తెలియజేశారు.బిపి షుగర్ ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు శిబిరానికి వచ్చేటప్పుడు తీసుకొని రావాలని తెలిపారు. కంటి శాస్త్ర చికిత్స జరిగిన రెండు గంటల తర్వాత ఇంటికి వెళ్ళవచ్చు లేకుండా ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్ర చికిత్సలో నిర్వహించబడతాయి. ఆధార్ కార్డు తప్పనిసరిగా గంట తీసుకుని రావాలని డాక్టర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందకం ఆస్పత్రి డాక్టర్ నవీన, శ్రీ ఎన్ ఆర్ ఐ అధినేత తేజస్విని , రిటైర్డ్ ఎ ఎస్పీ నరసింహా రెడ్డి, రిటైర్డ్ డిఎస్పీ శ్రీనివాసులు,మల్లం చంద్రమౌళి రెడ్డి శంకర నేత్రాలయం నిర్వాహకులు రంజిత్, ఆల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News