Friday, March 20, 2026

*తిరుచానూరులో పద్మావతి ఘాట్ ను పరిశీలించిన తుడా చైర్మన్* *స్వాగతం పలికి ఘన సన్మానం కూటమి నాయకులు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి రూరల్,డిసెంబర్ 11:తిరుచానూరు స్వర్ణముఖి నది తీరాన ఏర్పాటు చేయనున్న పద్మావతి ఘాట్ పరిశీలనకు గురువారం సాయంత్రం తుడా చైర్మన్ టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పూర్తి చేసి వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఘాట్ నిర్మాణం ప్రారంభించి,వాటర్ స్టోరేజ్ ,పిల్టర్ చేసి,గంగా హారతి అన్ని రకాలుగా సౌకర్యాలతో ఘాట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.ఈ పరిశీలనలో తుడా చైర్మన్ తో కలిసి తిరుచానూరు కూటమి నాయకులు పాల్గొని పద్మావతి ఘాట్ నిర్మాణం,స్థానికులకు ,భక్తులకు శుభ పరిణామమని, తుడా చైర్మన్ గా మీరు వేసే ప్రతీ అడుగు అటు పార్టీకి,పదవికి వన్నె తెచ్చిందని అభినందిస్తూ, సన్మానం చేశారు. టీడీపీ ,జనసేన ,బిజెపి నాయకులు తిరుచానూరు టీడీపీ నాయకులు 7 వ వార్డు సభ్యులు రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి,శేషాద్రి, దామినేడు రమేష్,బాలాజీ,డిస్కా శివ,జనసేన నాయకులు తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్ రాయల్,ప్రతాప్,సమరసింహా రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్, తిరుచానూరు గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి,బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి,ఉపాధ్యక్షులు నాగరాజు రెడ్డి,విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News