Monday, March 16, 2026

తిరుపతిలో టిన్ ఎకో సిస్టమ్ సెమినార్ విజయవంతం

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి రూరల్:తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో కిశోర విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నిర్వహించిన టిన్ ఎకో సిస్టమ్ సెమినార్ విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో కిశోరుల సమగ్ర అభివృద్ధికి దిశ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో వివరించారు.టిన్ ఎకో సిస్టమ్ స్థాపకులు శ్రీవత్సవ మాట్లాడుతూ సరైన మార్గదర్శకత్వం, ప్రభావవంతమైన విధానాలు, ప్రాయోగిక పరిష్కారాలు అందిస్తే కిశోరులు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతారని అన్నారు.కోచ్ శివ, డా.నాగేంద్ర, కోచ్ కార్తిక్,అనుపమ తోట తమ విలువైన సందేశాలతో విద్యార్థులను ప్రేరేపించారు.ఈ సెమినార్ ద్వారా కిశోరుల్లో విలువలు,బాధ్యతాయుత దృక్పథం,లక్ష్యసాధన పెంపొందించడమే లక్ష్యంగా తీసుకుని, దేశాన్ని సుస్థిర భవిష్యత్తు వైపు నడిపించే యువతను తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని నిర్వాహకులు వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News