Wednesday, March 25, 2026

**తిరుపతి గొల్లవాని గుంటలో శాప్ చైర్మన్ రవినాయుడు ఆకస్మిక పర్యటన*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి గొల్లవాని గుంటలో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం మరియు పలు క్రీడా ప్రాంగణాలు పురోగతిని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు పరిశీలించారు సందర్శన సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని ఆరా తీసిన చైర్మన్ రవినాయుడు , పనులను మరింత వేగవంతం చేసి, నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. త్వరితగతిన ఈ వసతులు క్రీడాకారులకు అందుబాటులోకి రావాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ , గంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ , కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ , మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీధర్ , జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డి ఎస్ డి ఓశశిధర్, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News