నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి, డిసెంబర్ 27 : శనివారం కలెక్టర్ మిని కాన్ఫిరెన్స్ హాలు నందు జరిగిన రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్’ (ఆర్ టి ఐ హెచ్) పై బోర్డు డైరెక్టర్లతో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్’ (ఆర్ టి ఒ హెచ్) బోర్డు డైరెక్టర్ల సమీక్షా సమావేశం నిర్వహించి తిరుపతిని ఎలక్ట్రానిక్స్, స్పేస్ మరియు అడ్వాన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్స్ రంగాలలో అగ్రగామిగా నిలబెట్టడానికి బోర్డు పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రాధాన్యత రంగాలయిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్స్ వంటి ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని బోర్డు నిర్ణయించిదన్నారు. తిరుపతి జిల్లాతో పాటు అనుబంధ జిల్లాల పారిశ్రామిక సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆ ప్రాంతాల్లో కూడా స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, ఆదాని , నవయుగ, అమర రాజా కంపెనీల నుండి మరియు ఐ ఐ టి తిరుపతి బోర్డు సభ్యులు, సిఇఓ, ఆర్ టిఐహెచ్. తదితరులు పాల్గొన్నారు.

