పండ్లతోట పెంపకం చేపట్టే చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి, జూలై 8 : జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం నందు ముని కృష్ణయ్య పొలం లో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఎకరాలు లోపు ఉన్న ఎస్ సి ,ఎస్ టి, చిన్న , సన్న కార రైతులు ఈ ఈ పథకానికి అర్హులు అని తెలిపారు. జిల్లా లో ఈ రోజు 500 ఎకరాలలో కొబ్బరి చెట్లు నాటేల లక్ష్యంగా చేసుకొని నాటడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఈ పథకం కింద ఒకే రకమైన పంటల పెంపకం కాకుండా రైతులకు నచ్చిన విధంగా వివిధ రకాల పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని తెలిపారు.. పండ్ల తోటల పెంపకానికి నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు.
అనంతరం రైతు పొలంలో సమీపంలో చేపట్టిన పశువుల నీటి తొట్టెను పరిశీలించి వేసవికాలంలో పశువులకు దాహం తీర్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, తాసిల్దార్ రామాంజనేయులు నాయక్, ఎంపీడీవో రామచంద్ర తెలుగు దేశం పార్టీ నాయకులు ఊరిబిండి మునిశేఖర్ రైతులు తదితరులు పాల్గొన్నారు