నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అన్ని టెస్టులు పూర్తయ్యేకే నెయ్యి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. తమ హయాంలో 18 సార్లు, 2014-19లో చంద్రబాబు 15సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు మాత్రమే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లుంటే వాటి ఆధారాలు చూపించాలని జగన్ డిమాండ్ చేశారు. టీటీడీ లోకి వెళ్లే ప్రతి ట్యాంకర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తారని, Nabl తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టు కూడా పాస్ కావాలని వైయస్ జగన్ అన్నారు. Nabl ల్యాబ్, టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ట్యాంకర్ లోపలికి వెళ్తుందన్నారు. ఇది తిరుమలలో రొటీన్‌గా జరుతుందన్నారు. 2014-19 మధ్య కిలో నెయ్యిని రూ. 276 నుంచి రూ. 318 వరకు కొంటున్నారని, ఇంత తక్కువకు కొన్నారంటే అది కల్తీ నెయ్యేనానని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఏ కంపెనీ అయినా సరే నిబంధనల ప్రకారం తనిఖీలు జరుగుతాయని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరని నిలదీశారు. ఒకరిని ఇరికించే ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ~~~~~~~~~~~~~~~~~~





