నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ నియోజకవర్గం తిర్యాణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కూడా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు మద్దతు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీశ్, నూతన ప్రజాప్రతినిధులు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ చుంచు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు ఆత్రం చంద్రశేఖర్, వెడ్మ కమల, మాజీ ఎంపీపీ మర్సకోల శ్రీదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

