నేటి సాక్షి, నారాయణపేట జూన్ 16, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో వేల రూపాయల వస్తువులు తీసుకొని వస్తానంటూ ఉదయించిన సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇలా ఉన్నాయి. బాధితుడు తీలేరు హనుమంతు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తీలేరు గ్రామంలో రేపటినుండి జరగబోయే శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు సందర్భంగా స్ప్రైట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వచ్చి తంసప్ లు, స్ప్రైట్ లు తీసుకొని వస్తానంటూ నగదు పదివేల రూపాయలు తీసుకొని వెళ్లి పోవడం జరిగిందని బాధితుడు వివరించారు. సోమవారం నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో నగదు 10,000 తీసుకుని ఫోను స్విచ్ ఆఫ్ లోని పెట్టడం జరిగిందని బాధితుడు వివరించారు. డబ్బులు తీసుకుపోయిన వ్యక్తికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.అట్టి ఫోన్ నెంబరు స్విచ్ ఆఫ్ అయి ఉందని బాధితుడు వివరించారు.

