నేటి సాక్షి, నారాయణపేట, మార్చ్ 14,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో రవి గౌడ్ రాధిక దంపతుల ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం* ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఇంటి కార్యక్రమానికి నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డిగారు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి మరియు రవి గౌడ్ రాధిక, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సూర్య మోహన్ , మరికల్ మండల అధ్యక్షులు వీరన్న , మరికల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు , రామకృష్ణ, రామకృష్ణ రెడ్డి , మరికల్ వార్డ్ సభ్యుడు అశోక్ , మాజీ ఉప సర్పంచ్ భద్రప్ప, చంద్రాములు , కురుమ అన్న , రాములు, రాజు, తదితరులు పాల్గొన్నారు.





