నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం) మాజీ సైనికులు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం గా గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామానికి నిరుపేదలకు ఎంతో సహా సహాయ సహకారాలు అందిస్తున్నారు .ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలో ముందా తుఫాన్ రావడంతో బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామపంచాయతీలో గృహాల వద్ద నీరు నిలిచిపోయి నిరుపేదలు అవస్థలు పడుతున్నారు వారికి రోజు వారి కూలీ కూడా రావడం దిగనంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాదు వలి సహకారంతో పదిమంది నిరుపేదలకు నిత్య సరుకులు పంపిణీ చేయడం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు కూడా నిరుపేదలను గుర్తించి వారికి చేయూత కల్పించి నిరుపేదలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ నయిముల్లా, షేక్ సత్తార్ , సయ్యద్ బుడా తదితరులు ఉన్నారు..





