నేటి సాక్షి న్యూస్ : ,చౌడేపల్లి మండలం , శెట్టిపేట పంచాయతీ ,అజ్జపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం గ్రామం నందు సీ సీ రోడ్డు నిర్మాణం చేశారు. అప్పటినుంచి బాగానేఉన్నా రోడ్డు ఈమధ్య తుఫాన్ కారణంగా రోడ్డుపై వర్షపు నీరు నిలవడం తో గ్రామంలోని చిన్న పిల్లలుకు ,వృద్ధులకు జ్వరాలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక గ్రామ ప్రజలు రాకపోకలు ,విద్యార్థిని విద్యార్థులు, పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు రాజారెడ్డి, నాగమణి రెడ్డి, శంకర్ రెడ్డి ,రామచంద్ర రెడ్డి, గోపాల్ రెడ్డి, సుబ్రమణి రెడ్డి, హేమ సుందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తెలియజేశారు . గతంలో కూడా దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా నిమ్మకు నీరు ఎత్తునట్టుగా ఉన్నారు. ఈ సమస్య పైన గ్రామస్తులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రానున్న స్థానిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతాం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య పైన గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రతినిధి వివరణ అడగగా ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని వారు తెలియజేశారు.





