Sunday, March 15, 2026

*తుఫాను బాధితులకు సాయం చేసేందుకు టిడిపి నాయకుల ముందడుగు* * బాధితులకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణి* పంపిణీ చేస్తున్న టిడిపి పార్టీ నాయకులు,అధికారులు..

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)ఆపదలో ఉన్న తుఫాను బాధితులను ఆదుకోవటానికి కర్లపాలెం మండల టిడిపి నాయకులు ముందుకు వచ్చారు. తక్షణ సాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు సహకారంతో అందజేసిన బియ్యం నిత్యవసర సరుకులను బాధితుల వద్దకు వెళ్లి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు నక్కల వెంకటస్వామి మాట్లాడుతూ తుఫాను లాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సమీక్షలు చేసి అధికారులను పార్టీ నాయకులను బాధితుల వద్దకు పంపి వారిని ఆదుకున్నారని కొనియాడారు. అనంతరం చింతయపాలెం సొసైటీ అధ్యక్షుడు మద్దిబోయిన బుల్లయ్యా మాట్లాడుతూ బాధితులకు అవసరమైన నిత్యవసర సరుకులతో పాటు బియ్యం కూడా అందజేసి వారి అకౌంట్లోనే నగదును జమ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుకే చెల్లిందన్నారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గం లో ఉన్న బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నిత్యం పర్యవేక్షణ చేసి బాధితులను ఆదుకున్నారన్నారు. టిడిపి సీనియర్ నాయకుడు నీటి సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ చింతయపాలెం గ్రామంలో తుఫాను బాధితులకు అందజేస్తున్న నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. బాధితులను గుర్తించి ఎటువంటి పక్షపాతం లేకుండా వారందరికీ అందజేస్తున్నమన్నారు. బాధితులను ఆదుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు,vro సుభాని,పంచాయితీ కార్యదర్శి, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్రి శ్రీను,టిడిపి నాయకులు సతీష్,ఎలుకా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News