Sunday, March 15, 2026

తుఫాన్ నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపంట నష్టం పై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివేదిక..

నేటి సాక్షి,నల్లబెల్లి అక్టోబర్ 31:ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్‌ కారణంగా నర్సంపేటతో పాటు పలు నియోజకవర్గాల్లో పంటలు ఆస్తులకు భారీ నష్టం సంభవించడంతో, నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయడానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరంగల్‌ జిల్లాకు విచ్చేశారు.సీఎంను జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీఎం తో కలిసి వరంగల్‌, హన్మకొండ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి, నర్సంపేట నియోజకవర్గంలో తుఫాన్‌ వల్ల జరిగిన పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.అలాగే పలు గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని, వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. హన్మకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన అన్ని సహాయ చర్యలు తక్షణమే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News