నేటి సాక్షి పాలేరు , నవంబర్ 25 :కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అంతర్గత రోడ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు అయ్యాయి.. మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తురకగూడెం గ్రామ అభివృద్ధికి అండగా నిలిచారు .ఇప్పటికే గ్రామంలో 20 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.. మరల గ్రామానికి 15 లక్షల రూపాయల మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి బాటలు వేశారు అన్నారు.. గతంలో ఏ రోడ్ చూసినా బురద మయంతో దర్శనం ఇచ్చేవి మంత్రి పొంగులేటి చొరవతో గ్రామంలో అంతర్గత రోడ్లకు మహర్దశయ కలిగింది.. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో బుర్ర వెంకన్న , కన్నెబోయిన నరేష్ ,గణపారపు మల్సూరు , ఫీల్డ్ అసిస్టెంట్ వసుకుల రామారావు ,బుర్ర మమత ,దాసరి నరేష్ , గుంటి లక్ష్మణ్ , మల్లయ్య ,కృష్ణయ్య ,హనుమయ్య ,నాగరాజు , మునేష్ ,సత్యం ,మంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు..





