నేటి సాక్షి మిర్యాలగూడ రూరల్:- రెండు సంవత్సరాలుగా మూతబడిన మిర్యాలగూడ మండలం రుద్రారం ప్రాథమిక పాఠశాల తిరిగి మంగళవారం మండల విద్యాధికారి బాలు నాయక్ చొరవతో తిరిగి ప్రారంభించబడింది. పిల్లలు నమోదు లేదనే కారణంతో దాదాపుగా రెండు సంవత్సరాలు మూతపడింది తిరిగి గ్రామ పెద్దల సహకారం తో పదిమంది విద్యార్థులతో ప్రారంబించి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించడం తో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాధికారి బాలునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కలిగి ఉన్నాయి. మంచి విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు కావున తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు.





