నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 12,తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ అని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరికల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గూప చెన్నయ్యను భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ మరికల్ గ్రామంలోని ప్రతి వార్డులో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించారు అనంతరం మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మరికల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి భూపతి చెన్నయ్యను గెలిపిస్తే మరికల్ గ్రామానికి 200 ఇందిరమ్మ ఇండ్లను మంజూరుకు కృషి చేస్తానని సభలో ఆయన తెలిపారు. మరికల్ గ్రామంలోని 449 లో ఉన్న భూములకు త్వరలోనే రైతులకు భూపాస్ పుస్తకాలు ఇప్పిస్తామన్నారు. మరికల్ గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న ఒకటో సర్వే నెంబర్లు మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఉచిత కరెంటు సౌకర్యం ప్రజలకు సన్నబియ్యం పథకం ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ చీరలు ఇందిరమ్మ గృహాలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గా నిలబడిన సర్పంచ్ అభ్యర్థి గోపన్నయ్యకు భారీ మెజార్టీ ఓట్లతో ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని బహిరంగ సభలో ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల కృష్ణయ్య,మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలగొంది వీరన్న, టైసన్ రాఘవేంద్ర, ఎన్ ఎస్ యు ఐ నాయకులు అన్వర్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, గాజుల ఖతాల్ హుస్సేన్, ఎల్ రాములు, ఆనంద్ కుమార్ ,సురేందర్ గౌడ్, మరికల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, గోవర్ధన్, బొంత మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.





