నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)= బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టం= రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తెలంగాణ గమ్యాన్ని మార్చిన చారిత్రక రోజు దీక్షా దివస్ .. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం దీక్షా దివస్ వేడుకలు పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ నాయకురాలు దాసరి ఉషా హజరైయ్యారు. సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా అంటూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన నినాదం సమరనాదంగా పనిచేసి మొత్తం తెలంగాణ జాతిని ఏకం చేసిందని, 11 రోజుల పోరాటంతో తెలంగాణలో పోరాటం పోటెత్తిందన్నారు. కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కలిసి వచ్చి తెలంగాణ కావాలని కొట్లాడరని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షకు దిగివచ్చి డిసెంబర్ 9 తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వచ్చిందన్నారు. స్వతంత్ర సంగ్రామ పోరాటంలో సిపాయిల తిరుగుబాటు జలియన్వాలా బాగ్ ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా వంటి అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నాయని అదే తీరుగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలోనూ అపూర్వమైన ఘట్టాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. చరిత్రను మలుపు తిప్పిన సమున్నత సందర్భాలలో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకటి అని నవంబర్ 29, 2009వ సంవత్సరం ఉద్యమ చరిత్రలో ఒక ఉజ్వల దృశ్యంగా నిలిచిపోతుందన్నారు.తెలంగాణ కోసం కలకంటూ తెలంగాణ జాతి కోసం తన పోరాటాన్ని ఇచ్చి సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. 1952 నుంచి కేసీఆర్ తెలంగాణ కోసం గులాబీ జెండా ఎత్తే వరకు అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు సమైక్యవాద శక్తులు ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమానికి చేసిన ద్రోహాలను, మోసాలను గుర్తుంచుకొని మలిదశ పోరాటంలో ఆ సవాళ్లు అన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగిన మహా నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.ఉద్యమంలో పట్టువిడుపులతో ముందుకు సాగిన కేసీఆర్ చాణక్యం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఇందులో భాగంగా ఎన్నో పదవి త్యాగాలు, ఎన్నో రాజీనామాలు చేసిన పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల కోసం బానిస లెక్క పెదవులు మూసుకుని తెలంగాణకు విద్రోహం చేశారని తెలిపారు.





