Saturday, March 14, 2026

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి.వికారాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ విజయ్ సునీల్.

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కేంద్రం లో నీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్లను ఖాతాలను ఆక్టివేట్ చేయాలని, డిపాజిట్స్ క్లెయిమ్ చేసుకోవాలని, కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతోంది.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టి.జి.బి), ప్రభుత్వ యాజమాన్యం షెడ్యూల్డ్ బ్యాంక్, తన విలువైన కస్టమర్లను, ప్రజలను కింది అంశాలపై దృష్టి సారించమని విజ్ఞప్తి చేస్తోంది —అక్టివేట్ కాని ఖాతాలు (ఇనొపరేటివ్ అకౌంట్స్), క్లెయిమ్ చేయని డిపాజిట్లు (అంకులయిమేడ్ డిపాజిట్స్) రీఫ్రెష్ కేవైసీ (ఆర్ ఇ కేవైసీ ) చేసుకొమ్మని తెలియజేస్తున్నది.భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ,భారత ప్రభుత్వ సూచనల ప్రకారం, టీ జి బి ఈ క్రింది అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది:అందరు కస్టమర్లు తమ కేవైసీ యువర్ కస్టమర్ వివరాలు బ్యాంక్‌లో అప్‌డేట్ అయినట్లు నిర్ధారించుకోవాలి.దీనివల్ల ఖాతాలు సక్రియంగా ఉంటాయి. కస్టమర్లు సరైన గుర్తింపు పత్రం చిరునామా పత్రాలతో సమీప శాఖను సందర్శించి కేవైసీ అప్‌డేట్ చేయవచ్చు.అలాగే, కస్టమర్ సర్వీస్ పాయింట్లు ( సి ఎస్ పి పాయింట్స్) వద్ద కూడా కేవైసీ పత్రాలు సమర్పించవచ్చు.రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కస్టమర్ లావాదేవీలు జరగని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలు ఉన్న కస్టమర్లు తమ శాఖలను సంప్రదించి, కేవైసీ పత్రాలు సమర్పించి ఖాతాలను తిరిగి సక్రియం చేసుకోవచ్చు.10 సంవత్సరాలకుపైగా క్లెయిమ్ చేయని నిక్షేపాలను బ్యాంక్, భారత రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ( డి ఈ ఏ) ఫండ్‌కు బదిలీ చేసింది. డి ఈ ఏకస్టమర్లు లేదా మరణించిన డిపాజిటర్ల చట్టబద్ధ వారసులు అవసరమైన పత్రాలను సమర్పించి ఏ శాఖలోనైనా ఈ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి:“మా బ్యాంకు ఖాతాదారులు ముందుకు వచ్చి తమ కేవైసీ వివరాలను ( కేవైసీ డీటెయిల్స్) అప్డేట్ చేయించుకోవాలని, ఇనొపరేటివ్ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలని, తమకు లేదా కుటుంబ సభ్యులకు చెందిన అంకులయిమేడ్ డిపాజిట్స్ ఉన్నట్లయితే వాటిని క్లెయిమ్ చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తన వినియోగదారులకు పారదర్శకత, విశ్వసనీయత, మరియు సామర్థ్యంతో సేవలు అందించడానికి కట్టుబడి ఉంది అని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News