*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం త్యాగాలు పోరాటాన్ని.స్మరించుకున్నరు బిఆర్ఎస్ మండల నాయకులు గోస్కుల జలందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు.కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు, మెడికల్ కాలేజీలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కేసీఆర్ నాయకత్వంలో యువత చదువుతో పాటు రాజకీయాల్లోనూ ముందుకు వచ్చి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి రూపకర్త అని, భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వమే రాష్ట్రానికి దిక్సూచి అని తెలిపారు ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు

