నేటి సాక్షి, ఎండపల్లి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలోని బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని ఎండపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సీపెల్లి శంకరా చారి విజ్ఞప్తి చేశారు. బీసీ ఐకాస కి మద్దతుగా మండలంలోని బీసీ కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల, బీసీ నాయకుల సహకారంతో ఈనెల 18వ తేదీన బంద్ ను విజయవంతం చేయడానికి త్వరలో ఎండపల్లి మండలం లోని అన్ని వెనుకబడిన కులాల మండల అధ్యక్షులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపెల్లి శంకరా చారి తెలిపారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ప్రతి బీసీ బిడ్డ నాది అనుకొని, వెనుకబడిన తరగతుల వారి హక్కుల కోసం నడుం బిగించాల్సిన సమయం వచ్చిందని ఆయన విజ్ఞప్తి చేశారు.




