Tuesday, March 10, 2026

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు – ఆకుల శ్రీ వాణి నుండి అభినందనలు.

మనసాక్షి ప్రతినిది,మహేశ్వరం(చిక్కిరి. శ్రీకాంత్)

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది ఎన్.రాంచందర్ రావుకి హృదయపూర్వక అభినందనలు!భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అంకితమై, నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేస్తూ ప్రజల మద్దతు సాధించిన ఎన్.రాంచందర్ రావు కి ఈ పదవి దక్కడం అత్యంత గర్వకారణం.ఈ సందర్భంగా పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల వాణి ని ప్రత్యేకంగా అభినందించాలి.ఆమె కృషి, క్రమశిక్షణ, ప్రజలతో నిత్యం ఉండి సమస్యల పరిష్కారానికి అంకితమైన విధానం – బీజేపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.ఈ నాయకత్వంలో రాబోయే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మా విశ్వాసం.శుభాకాంక్షలతో ఆకుల శ్రీ వాణి కార్పొరేటర్ – సరూర్నగర్ డివిజన్
భారతీయ జనతా పార్టీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News