నేటి సాక్షి మంచిర్యాల్ జనవరి 21 ( శ్రీధర్ దమ్మ)మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ బరిలో ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ ఉప్పరి నాగేష్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ప్రతి వార్డు నుండి కౌన్సిలర్ సభ్యులను టిఆర్ఎస్ (డి) పార్టీ టెలిఫోన్ గుర్తు నుండి బలపరుస్తామని అన్నారు. నిజాయితీగా ఉండి ప్రజలలో సేవాభావం కలిగి ఉన్న ఎవరికైనా వార్డు రిజర్వేషన్ ప్రకారంగా తమ పార్టీ నుండి కౌన్సిలర్ సభ్యునిగా బరిలో ఉంచుతామని అన్నారు.టీ ఆర్ ఎస్ (డి) పార్టీ నుండి కౌన్సిలర్ సభ్యునిగా పోటీ చేయాలనుకునే వారు 9403614372 నెంబర్ కు కాల్ చేయగలరని చెప్పారు. ఈ పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని సూచించారు. ప్రజల పట్ల మంచి ఆదరణ అభిమానం టి ఆర్ ఎస్ (డి)పార్టీకి ఉందని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలకు విఫలమైందని ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచిర్యాల్ పట్టణ ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన విమర్శించారు.

