నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడి ఉంది అని అన్నారు.తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.ఉచిత విద్యుత్ అమలుతో వ్యవసాయం విద్యుత్ అధిక వినియోగం అవసరం అనిరాష్ట్ర విభజన లో రాష్ట్రం పై భారం వేయకుండా కేంద్రం 2400 మెగా వాట్స్ కేటాయించింది. రాబోయే ఇరవై ఏళ్ల లో అవసరమయ్యే విద్యుత్ వినియోగం పరిగణలోకి తీసుకొని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అన్నారు.భవిష్యత్తు తరాల కోసమే నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడుతాయి అన్నారు.ఆర్థికాభివృద్ధి విద్యుత్ ఉత్పత్తి పై ఆధార పడింది.*చీరల పంపిణీ పై ఎన్నికల సంఘం నిర్ణయం పునః సమీక్షించాలి*చీరల పంపిణీ కొనసాగుతున్న కార్యక్రమం..చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలి అని కోరారు.ప్రజా పాలన ఉత్సవాలు అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు మానుకోవాలి అన్నారు.ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి,డబుల్ బెడ్రూం లబ్ధిదారులు ఇళ్లలో చేరాలి అన్నారు.





