Saturday, March 14, 2026

తెలంగాణ సామాగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలం వేతనాలు సకాలంలో చెల్లించాలి.

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 29,తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని పి వెంకటేష్ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కోరారు.తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని పి వెంకటేష్ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ధన్వాడ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ముందు ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య కోసం ఉద్యమం చేసినప్పుడు వారి ఉద్యమాన్ని విరమింప చేసే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు సమ్మె కాలం వేతనం తో పాటు నాన్ ఫైనాన్షియల్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.కానీ ఇప్పటివరకు కనీసం సమ్మె కాలం వేతనం కూడా ఇవ్వలేదని ఆయన వాపోయారు ఇప్పటికైనా సమ్మె కాలం వేతనం చెల్లించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నీరటి రాఘవేందర్ నాయుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, నాయకులు కుమ్మరి వెంకట్రాములు , శ్యాం ప్రసాద్, రాజేశ్వరి, గోవిందమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News