నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు కుటుంబ సభ్యులతో నేడు భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ఇరుముడిని ధరించారు. స్థానిక ఆసిఫాబాద్ కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గురుస్వాముల పర్యవేక్షణలో భక్తిభావంతో ఇరుముడి కట్టుకున్న అనంతరం, ఆమెతో పాటు ఇతర అయ్యప్ప స్వాములు కూడా ఇరుముడిని సిద్ధం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం “స్వామియే శరణం అయ్యప్ప” అనే నామస్మరణతో మారుమోగింది. ఇరుముడి ధరించిన అనంతరం, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మరియు ఇతర స్వాముల బృందం కలిసి శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో brs రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, దూడల అశోక్, గంధం శ్రీను,వినోద్ జైస్వాల్, రాజబాబు, ప్రేమ్, శీను స్వామి, నాగేష్,భక్తులు తదితరులు పాల్గొన్నారు





