Wednesday, March 25, 2026

*తేదీ:-29.11.2025*ఆసిఫాబాద్ నియోజకవర్గం*తెలంగాణ భవన్, ఆసిఫాబాద్ లో దీక్షా దివస్ వేడుకలు*

నేటి సాక్షి.కుమురం భీం ఆసిఫాబాద్ పట్టణంలోని తెలంగాణ భవన్‌లో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు “దీక్షా దివస్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా*ఎమ్మెల్యే కోవ లక్ష్మి* గారు, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరియు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె.సి.ఆర్. గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోతెలంగాణ రాష్ట్ర సాధన కోసం కె.సి.ఆర్. గారు చేసిన నిరంతర ఉద్యమం గురించి నాయకులు వివరించారు.తెలంగాణ ఏర్పాటు కోసం కె.సి.ఆర్. గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు.ఉద్యమంలో పాల్గొని, బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, brs కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News