నేటిసాక్షి, మిర్యాలగూడ : విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి మరియు ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విన్నర్స్ వరల్డ్ తైక్వాండో మిర్యాలగూడ బ్రాంచ్ కి చెందిన విద్యార్థులను డీఎస్పీ ఎస్ రాజశేఖర్ రాజు శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలనిఅలాగే విన్నర్ వరల్డ్ తైక్వాండో అకాడమీని అభినందిస్తు, ఇంకా ఎంతో మంది క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించి మిర్యాలగూడ పేరు జాతీయ స్థాయి లో వినిపించేలా చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో కోచ్ పవన్, నల్లపరాజు జానీ, విశ్వభారవి స్కూల్ ప్రిన్సిపాల్ రామకృష్ణ మరియు తల్లీతండ్రులు తదితరులు పాల్గొన్నారు.





