నేటి సాక్షి తొగుట జనవరి 01 గురువారం రోజున తొగుట రైతు వేదికలో రైతు లకు యూరియా కార్డులు తొగుట మార్కెట్ కమిటీ ఛైర్మెన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్ ) ,మరియు దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి ఆద్వర్యంలో పంపిణి చేయుట జరిగింది .ఈ యూరియా కార్డుల పంపిణి వల్ల యూరియా పంపిణి లో దళారుల నిర్ములన మరియు పంట సాగు చేసిన రైతులకు మాత్రమే యూరియా అందుతుందని తెలిపారు .ఈ యూరియా కార్డులు అన్ని గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో పంపిణి చేయుట జరుగుతుందని తెలిపారు.ఈ యూరియా కార్డులు తీసుకొని ఆధార్ కార్డు మరియు పట్టా దార్ పాస్ బుక్ లతో యూరియా విక్రయ కేంద్రాలలో సంప్రదించాలని తెలిపారు ,ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లు ,వ్యవసాయ అధికారి ,విస్తరణ అధికారులు ,రైతులు పాల్గొన్నారు .

