నేటి సాక్షి, బెజ్జంకి:మండలంలోని తోటపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ, ప్రతి గల్లీ లో, పరిశీలిస్తూ, అనుమానాస్పద ప్రదేశాలలో ఉన్న అక్రమ ఇసుక నిల్వలను గుర్తిస్తున్నారు.బెజ్జంకి ఎస్సై బి. సౌజన్య నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రదేశాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని, వాటిని తరలించడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కి తరలించే చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా గావించేవారిని ఉపేక్షించేది లేదని,ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులు ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్సై కోరారు.





