నేటి సాక్షి, జిన్నారం: ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొల్లారం మున్సిపల్ సి.ఐ రవీందర్ రెడ్డి మరియు వివిధ పార్టీల మున్సిపల్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను చేతబట్టి మున్సిపల్ వీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ త్రివిధ దళాలకు వందనం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం సీనియర్ నాయకులు వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ… దాయాది పాకిస్తాన్ దుశ్చర్యలను భారతీయ వివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.

