* ఉపాధ్యాయులకు జేఎల్, డిఎల్ గా పదోన్నతులు కూడా తెప్పిస్తాం.
* పీఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ
నేటి సాక్షి -కోరుట్ల
ఉమ్మడి ఏకీకృత సర్వీసు రూల్స్ ను సాధించి ఉపాధ్యాయులకు ఎంఈఓ లు, జేఎల్,డైట్ లెక్చరర్ గా ప్రమోషన్లను ఇప్పిస్తామని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, ఆనంద్ రావు అన్నారు.
వరంకుశం శోభారాణి స్కూల్ అసిస్టెంట్ సోషల్ జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ కోరుట్ల పదవి విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వామాట్లాడుతూ
పెండింగ్ లో ఉన్నటువంటి 5 డిఏలను, మంచి ఫిట్మెంట్ తో PRC ను ఇప్పిస్తాం.అని
317 జి వో ద్వారా అదనపు క్యాడర్ స్ట్రెంత్ లో ఏర్పడ్డ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.
SGT ఉపాధ్యాయులకు తక్షణమే 5500 ల పీఎస్ హెచ్ఎం పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేత క్రియేట్ చేపించి ప్రమోషన్లు ఇప్పిస్తామన్నారు.
ఇతర సమస్యల సాధన కోసం పిఆర్టియటిఎస్ ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభారాణి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అబ్దుల్ బాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షలు సర్తాజ్ అహ్మద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎ శ్రీనివాస్ సురేఖ, యూసుఫ్ అలీ, జయప్రద మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రవీణ్ సైఫుద్దీన్, జ్యోతిలక్ష్మి k. శ్రీనివాస్, బాలాజి గంగాధర్, కృష్ణమోహన్ రావు, కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు