ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు
లక్షెట్టిపేట – నేటి సాక్షి( రేగుంట ప్రసాద్ ) :
ప్రభుత్వ నూతన ఆసుపత్రి ఈ నెల 13న ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంగళవారం నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించబోతున్నాం దీనికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు రాజ నరసింహ వారితో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొంటారన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దండేపల్లి మండలం లొ పర్యటన చేసి తాళ్లపెట్ లొ బహిరంగ సభ ఉంటుంది అని, ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున మంత్రులు పాల్గొని ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. 13వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, జిల్లా ఆర్టియే మెంబెర్ అంకతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, డీసీహెచ్ కోటేశ్వర రావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..