నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్వామపక్ష పౌర,ప్రజాసంఘాల నాయకులు..శనివారం రాయచోటి తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిఆర్. రవిశంకర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అంబానీ అదా నీ లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అడవుల్లో ఉన్న ఆదివాసీలను బలవంతంగా ఖాళీ చేపించి లేదా వారిని చంపి అక్కడ ఉన్న ఖనిజాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పథకాలు పథకం ప్రకారం మానవహరనానికి పాల్పడుతుంది ఆదివాసీలకు గిరిజనులకు బహుజన సమాజానికి అండగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి దేశ సైన్యంతో మరియు పోలీసులతో బాంబుల వర్షం కురిపిస్తుంది ఈ విధంగా చేయడం చాలా అమానుషం, మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దేశవ్యాప్తంగా తన రాజకీయ స్వలాభావం కోసం ,అధికారం కోసము ప్రత్యర్థి రాజకీయ నాయకులపై అనేకమైన అక్రమ కేసులు బనాయించి జైలలోకి పంపుతున్నారు అంతేగాక ఆర్ఎస్ఎస్ అజెండాను అమలుపరుస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఈ దేశ సంపదను కాపాడుతున్న మూలవాసులైన ఆదివాసీలను వారికి అండగా ఉన్న మావోయిస్టులను కూంబింగల పేరుతో అడవులపై డ్రోన్లతోనూ బాంబుదాడులు చేస్తూ తన దేశ ప్రజలపైనే యుద్ధం చేయడం అనాగరికమని పేర్కొన్నారు. వెంటనే ఆదివాసీల తోనూ మావోయిస్టు పార్టీతోను శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సమాఖ్య నాయకులు విశ్వనాథ్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసి నివాస ప్రాంతాలలో ఉన్న మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు అని చూడకుండా వారిపై హత్యలు మహిళలపై అత్యాచారాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు ఇది మానవ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.అంబేద్కర్ సంగం నాయకులు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని తూర్పు పొడుస్తూ మనస్మృతిని ప్రవేశపెట్టడానికి మనస్మృతి పేరిట బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచనతో ఈ విధంగా బహుజనులైన పేద వర్గాలపై దాడులు చేయడం ఆక్షేపనీయమన్నారు.అంబేద్కర్ సేన నాయకులు పల్లం తాతయ్య మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటే షెడ్యూల్ 5, పైసా చట్టాన్ని అమలు పరచాలని అలాగే దండ కారణ్యంలో ఆవహించి ఉన్న సైన్యాన్ని వెంటనే అడవుల నుండి వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు శంకర్ నాయక్ ఎరుకల హక్కుల సంఘం నాయకులు సహదేవుడు,బీసీ నాయకులు అందేలా రమణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం .రవిశంకర్ సిపిఎం నాయకులు రామాంజులు బసిరెడ్డి మాధవయ్య నరసింహడీసీ వెంకటయ్య రెడ్డెయ్య ఈశ్వరయ్య రామచంద్ర వెంకటరమణ ప్రజాతంత్ర వాదులు నాగార్జున శివన్న సిద్దేశ్వర లు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు