Saturday, March 21, 2026

దందాలు కాదు.అభివృద్ధే ముఖ్యంచీలపల్లి,మేడిపల్లి,మాలినిలో పర్యటించిన ఆరెస్పి

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 8సిర్పూర్ నియోజకవర్గానికి దందాలు చేయడానికి రాలేదని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వచ్చానని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గెలిచిన పాలకులు అభివృద్ధిని మరిచి,తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇచ్చి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆయన సిర్పూర్ మండలంలోని చీలపల్లి,మేడిపల్లి గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ఇవ్వండి,అభివృద్ధి ఎలా జరుగదో నేను చూస్తానన్నారు. సర్పంచ్ అభ్యర్థులను అవసరమైతే హైదరాబాద్,ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఈ ప్రాంతాలకు రోడ్డు,విద్య,వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. రోడ్డు లేక గర్భిణీ స్త్రీలు,మహిళలు మరణించినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కలప స్మగ్లింగ్ చేసుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదన్నారు. నేను ఓడిపోయాక పెద్దవాగు దాటి పారిపోతానని కొంత మంది పాలకులు ఊహించి తప్పుడు ప్రచారం చేశారు,కానీ ఈ ప్రాంతాన్ని,ప్రజలను అభివృద్ధి చేసేదాక ఇక్కడినుండి కదిలేది లేదని పునరుద్ఘాటించారు.నేను ఓడానన్న బాధ లేదని,త్వరలో గెలిచేది నేనేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో అంగన్ వాడీ కేంద్రం,సెల్ ఫోన్ టవర్లు,పశువుల దవాఖాన,రోడ్డు,బ్రిడ్జిలు వంటి అభివృద్ధి పనులు జరగాలంటే తాము బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కలప దందా,బియ్యం దందా,కాంట్రాక్టుల పేరుతో దందా,పనులు చేయకపోయినా బిల్లులు కాజేసే దందాలు మా దగ్గర ఉండవని, నేను మా సర్పంచ్ అభ్యర్థులు అలాంటి సపోర్ట్ చేయనని, అలాంటి దందాలు చేసేవారిని చట్టపరంగా శిక్షించేదాక పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు,ఉద్యమకారులు సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ,మహిళ కన్వీనర్ లలిత,మాజీ ఎంపిపి మాలతి,మండల ఎన్నికల ఇంచార్జి గోలెం వెంకటేష్,చాంద్ పాషా,వాసు,పోచం,సర్పంచ్ అభ్యర్థులు,వార్డు మెంబర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News