Thursday, January 22, 2026

దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక.. ద్వారకానాథ్ రెడ్డి వ్యాఖ్యలుదర్గా ఉత్సవాల నిర్వహణకు 20 వేలు అందించి తనలోని భక్తిని చాటిన – తంబళ్లపల్లి శాసనసభ్యులు

నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని మొలకలచెరువు మండల కేంద్రమైన పెద్ద పాళ్యం గ్రామంలో గల సులేమాన్ షావలి దర్గా వద్ద జరుగుతున్న ఉర్సే షరీఫ్ కార్యక్రమంలో భాగంగా దర్గా వద్ద చాధర్ సమర్పించారు. అంతకు ముందు ముస్లిం మైనార్టీలకు ఆరాధ్యమైన దర్గా లో ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించేందుకు మత గురువులు, ముతవల్లీలు, దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అనుచరులతో కలిసి శనివారం గ్రామానికి చేరుకున్నారు. దర్గా వద్దకు విచ్చేసిన ద్వారకానాథ్ రెడ్డిని మండల వైసీపీ శ్రేణులు, గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. ఛాదర్‌ను పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మోసుకుంటూ దర్గాలోకి ప్రవేశించారు. స్వామికి చాదర్ ను ముజావర్లతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్లు దర్గా ప్రాశస్య్తం, విశిష్టతను తెలిపారు. దర్గాలో మత గురువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత గురువుల ఆశీస్సులు స్వీకరించారు. దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మతసామరస్యానికి ప్రతికగా దర్గా ఉత్సవాల నిర్వహణకు 20 వేలు అందించి తనలోని భక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి, ములకలచెరువు మండలాధ్యక్షుడు కోటిరెడ్డి మాధవరెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీపీ సాయి లీల, రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయసింహా రెడ్డి, టంగుటూరి విశ్వనాథ్, వడిగల ప్రతాప్ రెడ్డి, సర్పంచులు విజయ రవి శేఖర్ రెడ్డి, సునీత సుదర్శన్ రెడ్డి, కోనంగి మంజుల రామనాథం, బూత్ కమిటీ అధ్యక్షుడు బోనాల చాంద్ భాష, మల్లికార్జున్ రెడ్డి, జేసీబీ మంజునాథ్ నాయుడు, ఫక్రుద్దీన్, కోనంగి శ్రీనివాసులు, నాయి బ్రాహ్మణుల అధ్యక్షుడు చింతకుంట్ల నాగేంద్ర, యాసీన్, లవ కుమార్ లు హాజరయ్యారు.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News