నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి నవంబర్ 19: దళారుల చేతిలో మోసపోకండి అంటూ నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులకు సూచనలు ఇచ్చారు.నల్లబెల్లి మండలం నారక్కపేట, రాంపూర్,మేడిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏపీఎం సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పలాయి.శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను ప్రభుత్వ నిర్ధారిత మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, చెల్లింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఏపిఎం సుధాకర్ మాట్లాడుతూ రైతులకు మంచినీటి సౌకర్యం, టార్పాలిన్ కవర్లు, వడ్లను మ్యాచర్ చూసి వెంటనే కాంట వేసి గోదాములకు తరలిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వెంటనే తనను సంప్రదించాలని ఏపిఎం సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్,ఇస్తారు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ్యోతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేష్,మురళి, ఉపేందర్ రెడ్డి, జంగిలి మోహన్ జంగిలి మోహన్, శ్రీపతి సుమన్, ఏఈఓ మహేందర్, మహిళా సంఘం సభ్యులు,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.





