Thursday, March 19, 2026

*దళితులకు కేటాయించిన స్మశానవాటికను కాపాడి న్యాయం చేయాలని వినతి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)కలకడ మండలం కోనగ్రామానికి చెందిన సర్వే నెంబర్ 394 లో ఎస్సీలకు కేటాయించిన స్మశాన వాటికను ఒక ప్రైవేట్ వ్యక్తి కబ్జా చేసి తన పొలానికి దారి వేశారని గత నెల జిల్లాలో జరిగిన డీవీఎంసీ సమావేశంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెలియజేయడంతో కలెక్టర్ గారు వెంటనే స్పందించి కబ్జాకు గురైన ఎస్సీలకు కేటాయించిన స్మశాన వాటికకు హద్దులు చూపించాలని కలకడ మండల తహసిల్దార్ కు ఆదేశించడంతో తక్షణమే తహసీల్దారు మండల సర్వేయర్ దేవి నీ సంఘటన స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించడంతో ఈరోజు మండల సర్వే దేవి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులతో కలిసి కోన పంచాయితీ ఎస్సీ కాలనీ వాసులకు కేటాయించిన స్మశాన వాటికను పరిశీలించడం జరిగిందని అందులో కొంత కబ్జాకు గురైందని త్వరలో ఎస్సీలకు కేటాయించిన స్మశాన వాటికను సర్వే చేసి హద్దులు చూపిస్తామని తహసిల్దార్ దేవి తెలిపార పాలకుంట ని శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రామకృష్ణ, కలకడ మండల తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాదు రామాంజులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News