Tuesday, March 17, 2026

*దళితుల స్మశాన వాటికను కాపాడాలని పిజిఆర్ఎస్ లో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్ లకు వినతి పత్రం సమర్పించిన ప్రజా సంఘాల నాయకులు. పాములపాడు నవంబర్ 10

నేటి సాక్షి :- మండల కేంద్రమైన పాములపాడులోని, దళితుల స్మశాన వాటికను కాపాడాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కలబండి.అంకన్న, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, మాల మహానాడు జాతీయ నాయకులు అబ్రహం, బాలస్వామి లు దళితులతో కలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన పిజిఆర్ ఎస్ లో తహసిల్దార్ జి.సుభద్రమ్మకు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్ లకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్- ఎల్.నాగరాజు, సోషల్ వర్కర్ కే.నాగరాజు, మాల మహానాడు నాయకులు ఎన్.అబ్రహం, కే.అంకన్న, కే.బాలస్వామి లు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో ఉన్న సర్వేనెంబర్ 346లో విస్తరణ 1.85 సెట్ల స్థలాన్ని కాపాడాలని వారన్నారు. 2023 సంవత్సరంలో గతంలో ఈ మండలంలో పనిచేసిన తహసిల్దార్ ఇండస్మెంటు ఇవ్వడం జరిగిందిన్నారు. మళ్లీ ఇప్పుడు కబ్జాకు గురవుతుందని వెంటనే దళితుల స్మశానవాటికను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వము ప్రతి గ్రామంలో స్మశాన వాటికలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మించుకొవచ్చునని ఆదేశాలు జారీ చేసిన ఇంతవరకు ప్రభుత్వ అధికారులు అటువైపు అడుగులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో ఎకరా రెండు ఎకరాలు దళితుల స్మశాన వాటికలు ఉన్నాయని, ఆ స్మశానవాటికలకు భద్రత కరువైందని వారు అన్నారు. వెంటనే ఉపాధి హామీ అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జిల్లాలో ఉన్న ఎస్సీ స్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని, లేదంటే జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్-జి.రాజకుమారి గణియా కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాములపాడు ఎస్సీ కాలనీల ప్రజలు వ్యాసు, ఏసన్న, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, తిలక్, రఘు స్వర్ణ రాజు, రామదాసు, చిన్న నాగన్న, మల్లికార్జున, నాగన్న, మోషే, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News